పుట్టపర్తికి తరలివస్తున్న ప్రముఖులు
posted on Apr 24, 2011 12:23PM
అనంతపురం: భగవాన్ స
త్యసాయి బాబా మరణం వార్త వెల్లడికాగానే ప్రముఖులు పుట్టపర్తికి తరలి వస్తున్నారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తదితరులు సంతాపం ప్రకటించారు.
భగవాన్ సత్యసాయి బాబా మరణం వార్త వెల్లడికాగానే ప్రముఖులు పుట్టపర్తికి తరలి వస్తున్నారు. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి హైదరాబాద్ నుంచి పుట్టపర్తికి బయలుదేరారు. ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు కడప నుంచి పుట్టపర్తికి పయనమయ్యారు. బెంగళూరులో ఉన్న ప్రజారాజ్యం అధినేత చిరంజీవి బాబా మరణవార్త వినగానే పుట్టపర్తికి బయలుదేరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. రాష్ట్రంలోని ప్రముఖులే కాకుండా జాతీయస్థాయి నేతలు కూడా పలువురు తరలి రానున్నారు.