అందరి చూపు యజుర్వేద మందిరం పైనే

అనంతపురం: పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలోని భగవాన్ శ్రీ సత్యసాయి బాబాకు సంబంధించిన యజుర్వేద మందిరాన్ని సోమవారం ట్రస్టు సభ్యులు తెరవనున్నారనే సమాచారంతో పుట్టపర్తితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ట్రస్టుకు సంబంధించిన ఆదాయం అంతా యజుర్వేద మందిరంలోనే ఉన్నట్లు కథనాలు వస్తున్న నేపథ్యంలో మందిరాన్ని తెరుస్తారని తెలియడంతో అందరి చూపు అక్కడే ఉండిపోయింది. ట్రస్టు పేర లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయని, ఆ ఆస్తులన్నింటికీ సంబంధించిన పత్రాలతో పాటు డబ్బులు, బంగారం తదితరాలంతా యజుర్వేద మందిరంలోనే ఉన్నాయని పలువురి వాదన. అయితే మందిరాన్ని తెరిచే సమయంలో కేవలం ట్రస్టుకు సంబంధించిన వారినే లోపలకు ఆహ్వానిస్తారా మరెవరైనా వెళతారా అనే విషయంపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. అయితే అక్కడ కట్టుదిట్టమైన పోలీసు భద్రత కల్పించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu