నన్ను మంత్రిగా పిలవద్దు శంకరరావు
posted on Sep 9, 2011 3:24PM
హైదరా
బాద్: తనను మంత్రిగా పిలవద్దని అది ఎప్పటికైనా ఊడిపోయేదే అని చేనేత, జౌళీ శాఖ మంత్రి శంకర రావు శుక్రవారం అన్నారు. మంత్రి పదవి శాశ్వతం కాదన్నారు. నానక్ రాంగూడలోని భూములు అన్యాక్రాంత అయ్యాయన్నారు. రైతుల భూములను అన్యాయంగా లాక్కున్నారని ఆరోపించారు. హైదరాబాదు చుట్టుపక్కల పలుచోట్ల భూములు అన్యాక్రాంతానికి గురయ్యాయని వాటిపై విచారించాల్సిందిగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, గవర్నర్ నరసింహన్, సిబిఐకి లేఖ రాస్తానని చెప్పారు. 2004 నుండి 2009 మధ్య జరిగిన భూపందేరాలపై విచారణ జరపాలన్నారు. ఫార్ములా వన్ రేసు కోర్సు కోసం వేల ఎకరాల భూమి కేటాయించారని ఆ ప్రాజెక్టులు ఆగిపోయినా భూములు వెనక్కి ఇవ్వలేదన్నారు. కాగా మరో పది రోజుల్లో తన ఆస్తుల వివరాలను లోకాయుక్తకు అందజేస్తానని చెప్పారు.