ఆయనను కోర్టుకు ఎందుకు లాగలేదు సురేఖ

హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో అవినీతి జరిగిందని చెబుతున్న వారు అప్పట్లోనే ఆయనను కోర్టుకు ఎందుకు లాగలేదని పరకాల శాసనసభ్యురాలు కొండా సురేఖ శుక్రవారం అన్నారు. సర్కారు సుమోటోగా కేసెందుకు బుక్ చేయలేదన్నారు. ప్రతిపక్షాల పైనే సిబిఐ దాడులు జరుగుతున్నాయన్నారు. వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని  ఎదుర్కొన లేకనే జగన్ ఢిల్లీ టూర్‌పై విమర్శలు చేస్తున్నారని ఆమె అన్నారు. టిడిపికి రాజీనామా చేసిన నాగర్ కర్నూలు శాసనసభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డి వెనుక జగన్ లేరన్నారు.  కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులపై పోలీసుల దాడిని ఖండిస్తున్నట్టు చెప్పారు. విద్యార్థులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తి వేయాలని ఆమె డిమాండ్ చేశారు. కాంగ్రెసు పార్టీకి తెలంగాణ ఇచ్చే ఉద్దేశ్యం ఉందా మొదట స్పష్టం చేయాలని ఆమె అడిగారు. సకల జనుల సమ్మెను ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ కోసం పార్టీలన్నీ జెండాలు పక్కన పెట్టాలని కోరారు. ప్రస్తుతం తెలంగాణ మంత్రులు డైలామాలో ఉన్నారన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu