'జబర్‌దస్త్'గా సమంత అందాలు
posted on Jan 29, 2013 1:35PM
హీరో సిద్దార్థ, సమంత జంటగా నటిస్తున్న చిత్రం "జబర్ దస్త్ ". ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను రీసెంట్ గా విడుదల చేశారు. ఈ సినిమాలో సమంత తన అందాలను "జబర్ దస్త్ " గా చూపిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్లలో సమంత తన నడుము అందాలతో అభిమానులకు పిచ్చేక్కిస్తోంది. అసలకే వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న సమంత "జబర్ దస్త్ " లో తన అందాలతో ఏ మాయ చేస్తోందో వేచి చూడాలి.
శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు."జబర్ దస్త్ " సినిమాని నంది రెడ్డి దర్శకత్వం వహించగా, తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈచిత్రం ఫస్ట్ కాపీ సిద్దం అయింది. త్వరలో విడుదల తేదీ ప్రకటించనున్నారు. ఫస్ట్ కాపీ చూసిన అనంతరం హీరో సిద్ధార్థ ట్విట్టర్ ద్వారా తన అనుభవాలను పంచుకున్నారు. సినిమా చాలా బాగా వచ్చిందని, నా కెరీర్లో తొలిసారి లేడీ డైరెక్టర్ తో చేసాను. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. తప్పకుండా హిట్టవుతుందనే నమ్మకం ఉందని సిద్ధార్థ ట్వీట్ చేసారు