అబ్రకాదబ్రా.. మాయమైన రుషి కొండ.. ఆ మాంత్రికుడు ఎవరంటే?

గుడిని  మింగేవాళ్లు కొందరు ఉంటే.. గుడిలో లింగాన్ని మింగేవాళ్లు మరి కొందరుంటారు. ఇదంతా గతం. ఇప్పుడు కొండను మింగేవాళ్లు కొందరు ఉంటే.. రుషి కొండలో కొండను మింగేవాళ్లు మరికొందరు తయ్యారయ్యారు. ఇది ప్రస్తుతం. 

గద్దె నెక్కిన నాయకులు ప్రజల ఆస్తుల కర్పూరం చేసే పనిలో ఉన్నారంటే కలికాలం అని ఇన్నాళ్లు జనాలు బుగ్గలు నొక్కకున్నారు. కానీ.. కొండలను మింగే అనకొండలుగా తయారయ్యారనే వాస్తవాన్ని మాత్రం జనం జీర్ణించుకోలేక పోతున్నారు. అందునా విశాఖ ప్రజలు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి. తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తర్వాత అంతటి వాడు. 

అయితే తాజాగా విశాఖలో విజయసాయిరెడ్డి పేరిట రచ్చ రచ్చ జరుగుతోంది. విశాఖపట్నం రుషి కొండ సుందరమైన ప్రాంతం. ఆ ప్రాంతంలో రుషి కొండను పిండి చేయడానికి విజయసాయిరెడ్డి కంకణం కట్టుకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. వారు సైతం ఆందోళనకు దిగారు. విజయసాయిరెడ్డి కుమార్తె కోసం రుషికొండ వద్ద హోటల్ నిర్మిస్తున్నారని సమాచారం. 

అందుకోసం రుషి కొండను విజయసాయిరెడ్డి ఆదేశాలతో ఫిండి చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ఆ పార్టీ సీనియర్ నేత సీహెచ్ అయ్యన్న పాత్రుడు అయితే ఇదే అంశంపై ప్రెస్ మీట్ పెట్టి మరి ఏకంగా జగన్ పార్టీ నేతలపై విమర్శలు గుప్పించారు. 

అంతేకాదు రుషి కొండను పిండి చేస్తున్న పోటోలను సైతం టీడీపీ నేతలు తమ పార్టీ అధికారిక ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. అవి చూసిన విశాఖ నగర ప్రజలతోపాటు తెలుగు ప్రజలు.. అందునా విశాఖ అందాలు తిలకించిన ప్రతి ఒక్కరి మనస్సు మూగగా రోదిస్తుంది. రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదవా టైపులో విజయాసాయిరెడ్డి తలుచుకుంటే.. కొండలు పిండి చేయడం సులువే అని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.