దిగొచ్చిన ఆర్టీసీ
posted on May 8, 2015 4:30PM

వేతన సవరణలు జరపాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబునాయుడు, మంత్రులు, అధికారులు ఎంతమంది సమ్మె విరమించమని చెప్పినా వాళ్లు మాత్రం అవేమీ పట్టించుకోకుండా సమ్మె చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో సమ్మె విరమించని ఆర్టీసీ కార్మికులపై క్రమశిక్షణ ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని, గుర్తింపు పొందిన కార్మిక సంఘాలు ఈయూ, టీఎంయూ, టీఎన్‌యూ, ఎన్ఎంయూలకు ఉన్న సదుపాయాలను తొలగించాలని రహదారి రవాణా సంస్థ ఎండీ అన్నారు. ఈ నిర్ణయాలను వెంటనే అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ కార్మికుల సంఘాలు ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలకు ఇబ్బందుల్లో పడతామని ఆలోచించి మంత్రివర్గ ఉపసంఘంతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి ప్రకటించారు. సమస్యలపై మాట్లాడి పరిష్కారం ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకుంటే విధుల్లోకి చేరడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన అన్నారు.