నేరం రుజువైతే 6నెలల నుండి రెండేళ్ల వరకు శిక్ష
posted on Jun 1, 2015 12:44PM
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ టీడీపీ ఏమ్మెల్యే రేవంత్ రెడ్డి అవినీతి కేసులో ఇరుక్కున్న నేపథ్యంలో అతనిపై పైన ఐపీసీ సెక్షన్ 120 బీ, 34తో పాటు అవినీతి నిరోధక చట్టం1988 సెక్షన్ 12 ప్రకారం కేసు నమోదయింది. ఈ కేసులో రేవంత్ రెడ్డికి పలు సెక్షన్ లపై పలు విధాలుగా శిక్షలు పడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ రేవంత్ రెడ్డి నేరం చేశాడని రుజువైతే మాత్రం సెక్షన్ 120బీ ప్రకారం అతనికి ఆరు నెలల నుండి రెండేళ్లు లేదా జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. సెక్షన్ 34 ప్రకారం ఎవరి సహకారంతో నైనా నేరం చేసినట్లయితే వ్యక్తిగతంగానూ, అతనికి సహకరించిన వారికి కూడా శిక్ష పడుతుంది. రేవంత్ రెడ్డికి చెందిన రూ.50 లక్షలతో పాటు రెండు ఐ ఫోన్‌లను సీజ్ చేసినట్లు రిమాండు రిపోర్టులో ఏసీబీ అధికారులు తెలిపారు.