నేను ఏపార్టీలోకి వెళ్లను....

 

ఈ మధ్య తెలంగాణ టీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి పార్టీ మారుతున్నట్టు వార్తలు తెగ హల్ చల్  చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ వార్తలపై స్పందించిన రేవంత్ రెడ్డి ఆ వార్తలను ఖండించారు. ఈరోజు మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన తాను ఏ పార్టీలోకి వెళ్లనని, టీడీపీలోనే ఉంటానని తేల్చి చెప్పారు. ఇంకా తెలంగాణ డిప్యూటీ సీఎంపై ఆయన ఆరోపణలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గుట్కాల నిషేధం ఉన్నా, డిప్యూటీ సీఎం వియ్యంకుడు గుట్కాలు విక్రయిస్తున్నారని, అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu