రాజీనామాలపై రూటు మార్చిన స్పీకర్
posted on Nov 21, 2011 11:58AM
హైద
రాబాద్: రాజీనామాల అంశం విషయంలో నిన్నటి వరకు దూకుడుగా వెళ్లినట్లు కనిపించిన అయన డిసెంబర్ 1వ తేది నుండి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నందున ఆ లోగానే ఈ అంశాన్ని తేల్చాలనే ఉద్దేశ్యంతో స్పీకర్ ఇటీవల దూకుడుగా వెళ్లారు.ఇందులో భాగంగా నాగం, నల్లపురెడ్డిల రాజీనామాలు ఆమోదించారు. కొందరు జగన్ వర్గం ఎమ్మెల్యేలను కలిశారు.ఈ దశలో జగన్ వర్గానికి చెందిన పలువురు శాసన సభ్యులు రాజీనామాల విషయంలో తమ వైఖరి ఏంటో స్పీకర్ మనోహర్‌ను వ్యక్తిగతంగా కలిసి మరీ తమ మనసులో మాటను వివరించారు.
ఇక, జగన్ వర్గానికి చెందిన మరికొందరు ఎమ్మెల్యేలు కూడా రాజీనామా విషయంలో స్పష్టమైన వైఖరిని ప్రదర్శించకుండా 15 రోజులు గడువు కావాలని కోరుతున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రాంతానికి చెందిన రాజీనామా చేసిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ మనోహర్ ఆచితూచి వ్యవహరించాలని భావిస్తున్నారు. రాజీనామాల అంశంలో ఆయా ఎమ్మెల్యేల అభిప్రాయాలు విన్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ఆయన భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది.