సీమలో మళ్ళీ ఫ్యాక్షనిజం?
posted on Jul 14, 2012 6:02PM
ఫ్యాక్షన్ గొడవలకు కేంద్రం రాయలసీమ. అందుకే ఈ సీమలోని ప్రతీప్రాంతంలోనూ మనుష్యులు రాటుదేలినట్లుంటారు. కయ్యానికి సై అనేలా గొడ్డుకారం తింటారు. ఆకలి, ఆగ్రహం రెండూ ఎక్కువగానే ప్రదర్శిస్తారు. ఇలాంటి ఈ సీమలో ప్రధానమైన జిల్లా అనంతపురం. ఆకలితో అలమటించే పేదైనా సీమలోని అతని ఇలాకాను బట్టి ఏ గ్రూపో నిర్ధారణక గురవుతుంది. ఒకగ్రూపు వ్యక్తి ఇంకో గ్రూపు అమ్మాయిని కూడా ఇష్టపడరు. నచ్చితే ప్రాణం పెడతాం లేకపోతే దాన్నే తీస్తామన్న సినిమాలో డైలాగుకు సీమలోని ఫ్యాక్షనిజానికి అంతటి లింకే ఉంది. ఫ్యాక్షనిస్టులు కూడా తమకు అనుకూలమైన పార్టీలను ఎంపిక చేసుకుంటారు. ప్రత్యేకించి గొడవ పడటానికి వీలుగా ప్రత్యర్థి పార్టీలను ఎంచుకుంటారు.
కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీలు ఫ్యాకనిజానికి అడ్డాగా మారాయి. అయితే ఈ మూడిరటిలోనూ తాజాపార్టీ వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. ఇదీ ఫ్యాక్షనిస్టుల పార్టీ అయినా కొత్తగా ఉద్భవించినందున సద్దుమణిగి ఉంటూ ఇతర పార్టీలతో సర్దుకుంటోంది. అయితే తెలుగుదేశం, కాంగ్రెస్ నేతలు ఎదురుపడితేఏ మాత్రం ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. తాజాగా అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం నాగిరెడ్డిపల్లిలో పాతకక్షలు తిరిగి రాజుకున్నాయి. కాంగ్రెస్ నేత సీతారామాంజనేయులును తెలుగుదేశం నేత వెంకటేశ్వర్లు స్కార్పియోతో ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రామాంజనేయులను ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలిసిన కాంగ్రెస్ కార్యకర్తలు వెంకటేశ్వర్లు ఇంటిపై దాడికి తెగబడుతున్నారు. దీంతో ఇద్దరు ఫ్యాక్షన్‌తగదాలకు నాగరెడ్డిపల్లి వేదికగా మారుతోంది.