పెళ్లి విషయంలో క్లారిటీ ఇచ్చిన రణబీర్

 

బాలీవుడ్ లో రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ ల ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే. వీరిద్దరి ప్రేమ గురించి, వారి పెళ్లి గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త వింటూనే ఉంటాం. అయితే ఎప్పుడూ వార్తల్లో వినడం తప్ప వాళ్లు నోరు విప్పి చెప్పడం మాత్రం చాలా తక్కువ. అయితే రణబీర్ కపూర్ వారి ప్రేమ విషయంపై విలేకర్ల ముందు మాట్లాడాడు. ఆరేళ్లుగా మీడియా నా పెళ్లి గురించి ఏదో ఒకటి రాస్తూనే ఉందని, దయచేసి ఇకనైనా ఊహాగానాలు ఆపి రాయడం మానేయండని అన్నాడు. ప్రస్తుతం ప్రేమలో ఉన్నా, అది ఆస్వాదిస్తున్నా అప్పుడే పెళ్లి చేసుకోను అని చెప్పారు. ఒక వేళ చేసుకున్నా అందరికీ చెప్పి చేసుకుంటా, రహస్యంగా మాత్రం చేసుకోను ఎందుకంటే అది కుటుంబ వేడుకు అని అన్నాడు. పాపం వార్తలతో విసిగెత్తిపోయాడేమో రణబీర్ ఈ రకంగా క్లారిటీ ఇచ్చాడు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu