రక్షణ మంత్రికే రక్షణ లేదు
posted on Apr 20, 2023 1:34PM
కరోనా మహమ్మారి కేంద్ర రక్షణ శాఖామంత్రి రాజ్ నాథ్ సింగ్ ను వదల్లేదు. గురువారం ఆయనకు పాజిటివ్ అని తేలడంతో అధికార పార్టీని కలవరపరిచింది. రక్షణ శాఖా మంత్రికే కరోనా నుంచి రక్షణ లేనప్పుడు సామాన్యుడి పరిస్థితి ఏమిటనే చర్చకు దారి తీసింది.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కమాండర్స్ కాన్ఫరెన్స్ దేశ రాజధానిలో జరుగుతున్న సమయంలోనే రాజ్ నాథ్ సింగ్ కు కరోనా ఉన్న విషయం బయటపడింది. ఆయనకు పాజిటివ్ అని తేలడంతో వెంటనే హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. దేశ రాజధానిలో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి.
కరోనా ఇటీవలి కాలంలో పెరిగిపోవడం సామాన్య ప్రజలను ఆందోళన పరుస్తుంది . ఢిల్లీ ఆరోగ్య శాఖామంత్రి భరద్వాజ్ కరోనా మహమ్మారి మరింత తీవ్ర రూపం దాల్చబోదని చెబుతున్నప్పటకీ ఢిల్లీలో కరోనా బాధితులు ఎక్కువవుతున్నారు. కరోనాను సత్వరం ఎదుర్కోగలమని ఢిల్లీ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ చేతల్లో పురోగతి లేదు.