మెదక్ లో రోడ్డెక్కిన అన్నదాతలు
posted on Aug 3, 2014 8:25PM

విద్యుత్ కోతలను నిరసిస్తూ జిల్లాలోని అన్నదాతలు రోడ్డెక్కారు. వ్యవసాయానికి ఏడు గంటలపాటు కరెంట్ సరఫరా చేయాలని రామాయంపేటలో ఆందోళన చేపట్టారు. జాతీయ రహదారిపై బీజేపీ ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో చేశారు. ట్రాఫిక్ భారీగా నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో పోలీసులు-రైతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మరోవైపు చేగుంట మండలం, నార్సింగ్ సబ్‌స్టేషన్‌ను రైతులు ముట్టడించారు. అక్కడే ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా తోటి రైతులు అడ్డుకున్నారు. గోదావరిలో నీళ్లులేవని, తాగడానికి నీళ్లు లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నేతలకు మాత్రం 24 గంటలు కరెంట్ ఉంటుందని, వ్యవసాయానికి మాత్రం విద్యుత్ ఉండదని రైతులు మండిపడ్డారు.