మోడీని చంపాలనుకున్నా.. సిమి



చత్తీస్ఘడ్ పోలీసుల విచారణలో స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా(సిమీ) ఉగ్రవాది గుర్ఫాన్ వెల్లడిస్తున్న విషయాలకు పోలీసులు షాకవుతున్నారు. అంబికాపూర్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భారత ప్రధాని నరేంద్ర మోడీని హత్య చేయాలని ప్లాన్ చేసామని, అయితే  కొన్ని కారణాల వల్ల, తమ పథకం అమలు చేయలేకపోయామని  పోలీసుల విచారణలో చెప్పాడు. ఇండోర్ పోలీసులు ఇజాయిద్దీన్, అస్లాం ను ఎన్కౌంటర్లో చంపేశారు. వారు హతమైన తరువాత గుర్ఫాన్ స్వయంగా పోలీసులకు లొంగిపోయాడు.

రాష్ట్ర ఐజీ జేపీసింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్ పేలుళ్ళ సంఘటన తరువాత పరారైన గుర్ఫాన్ అరేబియన్ సముద్రానికి సమీపంలో తలదాచుకున్నాడు. కొంతకాలం తరువాత అక్కడి నుండి అతను దుబాయ్కు వెళ్లాడు. అక్కడ అంతర్జాతీయ ఉగ్రవాది అబూసలేంతో సమావేశమయ్యాడు. అంతేకాదు సిమీ నేతల ఆధ్వర్యంలో నేపాల్లో జరిగిన న్యూ ఇయర్  గ్రాండ్ పార్టీకి కూడా హాజరైనట్టుగా పోలీసులు చెబుతున్నారు. ఈ పార్టీకీ  ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సిమీ నేరగాళ్లందరూ హాజరైనా కూడా భారతీయ నిఘా వ్యవస్థ కనుక్కోలేక పోయిందని గుర్ఫాన్పోలీసులకు తెలిపినట్టుగా తెలుస్తోంది. అయితే గుర్ఫాన్ పోలీసుల విచారణకు సహకరిస్తున్నప్పటికీ.. కీలకమైన విషయాలు మాత్రం చెప్పట్లేదని ఐజీ జేపీసింగ్ తెలిపారు.