రైల్వే బడ్జెట్ విశేషాలు
posted on Mar 14, 2012 12:45PM
న్యూఢిల్లీ : 2012-13 సంవత్సరానికిగానూ కేంద్ర రైల్వే మంత్రి దినేష్ త్రివేది ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ విశేషాలు
రైల్వే భద్రతకు రూ. 1
6842 కోట్లు కేటాయింపు
ప్రమాదాలు జరగకుండా భద్రతే రైల్వే ప్రధాన లక్ష్యం
ఇండిపెండెంట్ రైల్వే సేఫ్టీ అధార్టీ ఏర్పాటు
నవీకరణ లేకుండా భద్రతా చర్యలు సాధ్యం కావు
వచ్చే అయిదేళ్లలో కాపలా లేని రైల్వే గేట్లు తొలగింపు
సామాన్యుడికి మేలు జరిగేలా బడ్జెట్ రూపుకల్పన
ఇండియన్ రైల్వేను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళతాం
రైల్వే భద్రతా చర్యలకు అగ్రతాంబూలం
అనిల్ కకోద్కర్ కమిటీ సిఫార్సులను పాటిస్తాం
ప్రమాదాల నివారణకు శాయశక్తులా కృషి
రైల్వే భద్రత మరింత పెరగాలి
ప్రమాదాల సంఖ్యను తగ్గించాం...ఇంకా తగ్గించాలి
అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రయాణికులకు భద్రత
రైల్వే భద్రతకు నిధుల కొరత
రైల్వేల ఆధునీకరణకు రూ.75వేల కోట్లు ప్రభుత్వం సమకూర్చనుంది
నిర్వహణ వ్యయాన్ని తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు
నిర్వహణ సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు
శ్యాం పిట్రోడా కమిటీ సిఫార్సుల అమలుకు నిర్ణయం
సరిహద్దుల్లో రైల్వే ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం
బడ్జెట్ లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట
పెండింగ్ లో ప్రస్తుతం 487 రైల్వే ప్రాజెక్టులు
బడ్జెట్ అంటే లెక్కల పత్రం కాదు
వనరుల మేరకే నిధుల కేటాయింపు