రాహుల్ పాదయాత్రలో టీ షర్ట్ పైన జాకెట్..
posted on Jan 20, 2023 11:37AM
భారత్ జోడో యాత్రలో శుక్రవారం ఓ విశేషం కనిపించింది. ఇంత కాలంగా కేవలం టీ షర్ట్ మాత్రమే వేసుకుని చలిని లెక్క చేయకుండా పాదయాత్ర సాగించిన రాహుల్ గాంధీ.. ఇప్పుడు జమ్మూ కశ్మీర్ లో ఆయన పాదయాత్ర పవేశించిన తరువాత చలి నుంచి రక్షణ కోసం జాకెట్ ధరించారు. ఇప్పటి వరకూ 125 రోజులలో 3400 కీలోమీటర్ల మేర పాదయాత్ర సాగించిన రాహుల్ గాంధీ ఇన్ని రోజులూ చాలా చాలా సింపుల్ గా టీ షర్ట్ మాత్రమే ధరించి నడక సాగించారు.
ఎందరు ప్రశ్నించినా తనకు చలి అనిపించేంత వరకూ స్వెట్టర్, జాకెట్ వేసుకునే ప్రశక్తి లేదని రాహుల్ పలుమార్లు స్పష్టం చేశారు. గజగజలాడించే చలిలో సైతం ఆయన కేవలం టీషర్ట్ తోనే నడిచారు. అయితే పంజాబ్ నుంచి జమ్మూ కాశ్మీర్ లో అడుగు పెట్టిన తరువాత ఆయన జాకెట్ వేసుకోక తప్పలేదు. జమ్మూలో ఉదయం నుంచీ చిరు జల్లులు కురుస్తున్నాయి.
దీంతో రాహుల్ గాంధీ కొద్ది సేపు టీషర్ట్ వేసుకున్నారు. అనంతరం తొలగించేశారు అది వేరే విషయం. జమ్ము-కశ్మీర్ లో రాహుల్ కు మరింత భద్రతా ఏర్పాట్లు చేశారు. భద్రతా వలయాన్ని పటిష్టం చేశారు. జామర్స్ ను కూడా పెట్టారు. కశ్మీర్ లోని కొన్ని ప్రాంతాల్లో కాలి నడకన వెళ్లద్దంటూ భద్రతా బలగాలు రాహుల్ ను ఇప్పటికే హెచ్చరించాయి కూడా. ఈనేపథ్యంలో భారత్ జోడో యాత్రలో కొన్ని మార్పులు చేస్తూ, పాదయాత్రను కుదిస్తున్నారుకూడా.