జీవో నంబర్1పై సుప్రీంలో జగన్ సర్కార్ కు దక్కని ఊరట

జీవో నంబర్ 1 విషయంలో జగన్ సర్కార్ కు సుప్రీం కోర్టులో కూడా ఊరట లభించలేదు. రాష్ట్రంలో సభలూ సమావేశాలను నిషేధిస్తూ జగన్ సర్కార్ విడుదల చేసిన జీవో నంబర్ 1 ను ఏపీ హైకోర్టు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ జగన్ సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే సుప్రీం కోర్టు ప్రస్తుత పరిస్థితుల్లో జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు పేర్కొంది.

హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు జరిగే విచారణలో వాదనలు వినిపించాలని ఏపీ సర్కార్ కు సూచించింది. 23వ తేదీన కేసు విచారణలోకి తీసుకోవాలని ఏపీ హైకోర్టు జడ్జిని ధర్మాసనం ఆదేశించింది.  ప్రమాదాల నివారణ కోసమే జీవో నంబర్ 1 తీసుకొచ్చామని, ప్రజలకు ఇబ్బంది కలగని ప్రాంతాల్లో సభలు, సమావేశాలు నిర్వహించుకోవచ్చని జగన్ ప్రభుత్వం చెబుతున్నా. వైసీపీ వినా అన్ని రాజకీయ పార్టీలూ  జీవోను వ్యతిరేకిస్తున్నాయి. ప్రతిపక్షాల గొంతు నొక్కడం కోసమే జీవో తెచ్చారని, ఎమర్జెన్సీ కంటే కూడా దారుణమైన జీవో ఆరోపిస్తున్నారు.

జీవోను వ్యతిరేకిస్తూ ఏపీ హైకోర్టులో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిటిషన్ వేశారు. రామకృష్ణ పిటిషన్‌పై విచారణ చేపట్టి జీవోను ఈ నెల 23 వరకూ హైకోర్టు సస్పెండ్ చేసింది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంను రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించింది.