రాహులు జగన్ టూర్ సీక్రెట్ ఎంటీ?
posted on Jul 27, 2015 11:16AM
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అనంతపురం జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. దానికి ముందు వైఎస్సార్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కూడా అనంతపురం జిల్లాలో పర్యటించారు. అయితే ఇప్పుడు వీరిద్దరూ ఒకే సమయంలో యాత్రలు చేపట్టంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాహుల్, జగన్‌లు అనంతపురం జిల్లాలో రహస్యంగా కలిశారా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. వీరిద్దరూ కావాలనే ఒకేసారి పర్యటనలో పాల్గొన్నారని.. రహస్యంగా కలిసి మంతనాలు జరిపారని పలు రాజకీయ విశ్లేషకులు చెవులుకొరుక్కుంటున్నారు. అసలు ఇంతకు ముందే పలువురు కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీని వీడి వైఎస్సార్ పార్టీలోకి వెళ్లిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వైస్సార్ పార్టీలోకి వెళ్లి జగన్ ను కాంగ్రెస్ లోకి తీసుకొస్తారేమో అని పలు విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు దీనిలో భాగంగా రాహుల్ గాంధీ, జగన్ నిజంగానే కలిశారా? కలిస్తే ఏం మాట్లాడుకున్నారు? అనే ప్రశ్శలు మొదలవుతున్నాయి.
ఇదిలా ఉండగా పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక హోదా గురించి మాట్లాడని రాహుల్ గాంధీ అక్కడి నుండి అనంతపురం వచ్చి ఇక్కడ ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం చాలా ఆశ్యర్యంగా ఉంది. జగన్ కూడా ఎప్పుడు ఏ సాకు దొరుకుతుందా ఏ కారణంతో ప్రతిపక్షపార్టీని విమర్శించాలన అని చూడటమే తప్ప ప్రత్యేక హోదా గురించి ఎక్కువ మాట్లాడింది లేదు. ఈ నేపథ్యంలో పలువురు టీడీపీ నేతలు ఇద్దరు నేతలపై మండిపడుతున్నారు. ఇద్దరు కూడబలుక్కొని అనంతపురంలో పర్యటించారనే ఆరోపిస్తున్నారు. తెలుగుదేశాన్ని దెబ్బతీయడానికే తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కుట్రలు చేసినా టీడీపీని ఏం చేయలేరని టీడీపీ వర్గాలు తెలిపాయి.