టీడీపీకి రేవంత్ రాజీనామా.. అందుకే రాజీనామా చేశా..!
posted on Oct 28, 2017 2:32PM
.jpg)
తెలంగాణ టీడీపీలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఎవ్వరూ ఊహించని విధంగా రేవంత్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశాడు. విదేశీ పర్యటన ముగిసిన అనంతరం ఇక్కడికి వచ్చిన పార్టీ అధినేత చంద్రబాబు టీటీడీపీ నేతలను అమరావతి రమ్మని ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ టీడీపీ నేతలు నేడు అమరావతి వెళ్లగా.. రేవంత్ రెడ్డి కూడా వెళ్లారు. అయితే అక్కడ విదేశీ పర్యటన గురించి మీడియా సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే సమావేశమందిరాన్ని వీడి వెళ్లిపోయిన రేవంత్ రెడ్డి రాజీనామా చేశారు. పార్టీలో పరిణామాలు తనను చాలా ఇబ్బందిపెట్టాయని ఆరోపిస్తూ ఆయన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. పార్టీపైనా, చంద్రబాబుపైనా తనకు చాలా గౌరవం ఉందని.. చంద్రబాబు తనకు తండ్రిలాంటి వారని ఆయన చెప్పారు. కేసీఆర్ పై తాను పోరాడుతుంటే పార్టీ నేతలే ఆయనతో అంటకాగడం తనను ఇబ్బంది పెట్టిందని ఆయన స్పష్టం చేశారు.
ఇక రేవంత్ రెడ్డి రాజీనామాపై స్పందించిన చంద్రబాబు.. తరువాత మాట్లాడదాం ఉండాలని రేవంత్ రెడ్డికి చెప్పానని... విదేశాల నుంచి వచ్చిన తరువాత అక్కడ ఏం జరిగిందన్నది రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని, అందుకే మీడియా సమావేశం పూర్తయిన తరువాత కలుద్దామని, అందర్నీ ఉండమని చెప్పానని ఆయన అన్నారు.