రాహుల్ జైలుకు వెళ్లడానికైనా సిద్దంగా ఉన్నారా..?
posted on Dec 10, 2015 5:14PM
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, కొడుకు రాహుల్ గాంధీ ఇద్దరూ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కోర్టుకు హాజరవ్వాలని సోనియాను, రాహుల్ ను కోర్టు ఆదేశించగా వారు మాత్రం హాజరుకాలేదు. దీంతో ఆగ్రహించిన కోర్టు ఈ నెల 19 వ తేదీన ఎలాగైనా కోర్టుకు హాజరు కావాల్సిందే అని ఆదేశించింది. అయితే ఈ కేసుకు సంబంధించి రాహుల్ ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అదేంటంటే 19వ తేదీన కోర్టుకు హాజరైనప్పుడు రాహుల్ జైలుకు వెళ్లడానికైనా సిద్దంగా ఉన్నారంట.. బెయిల్ కూడా తీసుకోరంట. అంతేకాదు.. ఈ నిర్ణయానికి సోనియా కూడా ఓకే చెప్పారంట. తాము ఎలాంటి నేరం చేయనందున తమపై సానుభూతి వెళ్లి విరుస్తుందని ప్రధాని మోడీ తన ప్రత్యర్థులపై కక్ష ఎలా తీర్చుకుంటున్నారనే విషయం కూడా ప్రజలకు అర్థమవుతుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయట. అయితే ఈకేసులో కోర్టుకు హాజరవుతున్న సోనియా.. 86 ఏళ్ల మోతీలాల్ వోరా సహా మిగిలినవారు కూడా బెయిల్ దరఖాస్తు చేసుకుంటారు ఒక్క రాహుల్ తప్ప. మొత్తానికి రాహుల్ సానుభూతి కోసం బానే ట్రై చేస్తున్నట్టు కనిపిస్తోంది.