భక్తులు గుండె నిబ్బరం చేసుకోవాలి: అనిల్
posted on Apr 24, 2011 12:29PM
పుట్టప
ర్తి: భగవాన్ శ్రీ సత్యసాయి బాబాది కేవలం దేహమే అయితే ఎలా అని ఆయన ప్రపంచమంతా ఎలా దర్శనమిస్తారని అందుకే ఆయన తన దేహాన్ని వీడినారని భక్తులు తెలుసుకోవాలని బాబా ప్రసంగాలను అనువదించిన డాక్టర్ అనిల్‌కుమార్ ఓ టీవి కార్యక్రమంలో భక్తులకు సూచించారు. బాబా భక్తులు గుండె నిబ్బరం చేసుకోవాలని చెప్పారు. బాబా కేవలం దేహాన్ని మాత్రమే వీడారని, ఆత్మ అలాగే ఉందని, ఆ ఆత్మ కూడా భక్తుల మదిలో నిత్యం ఉంటుందని చెప్పారు. సత్యసాయి వ్యక్తి కాదని శక్తి, మహాద్బుత వ్యక్తి అని చెప్పారు. సాయిబాబా పిలిస్తే పలికే వ్యక్తి అని అన్నారు. బాబా లేరని మన నోట రాకూడదన్నారు. మానసికంగా బాబా మన మదిలోనే ఉన్నారన్నారు. మనం బాబా మాటలను నిత్యం గుర్తు పెట్టుకోవాలన్నారు. షిర్డి సాయిబాబా సమాధి నుండే మాట్లాడతానని ఆనాడే చెప్పారని అన్నారు. అలాగే బాబా ఇప్పుడు దేహం విడిచి మాత్రమే వెళ్లారని అన్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోడమే బాబా ముఖ్య ఉద్దేశ్యం అని చెప్పారు. సాయీ అని పిలిస్తే ఓయూ అని పలికే వాడు బాబా అని చెప్పారు. ఈ సందర్భంగా అనిల్‌కుమార్ ట్రస్టు సభ్యులపై అపనమ్మకం వద్దని భక్తులను కోరారు. ట్రస్టు సభ్యులు బయటకు వెళితే లక్షల జీతం వస్తుందని దానిని వదులుకొని బాబా సేవలో ఉన్నారన్నారు. బాబా సేవలో చిత్తశుద్ధితో ఉన్న ట్రస్టు సభ్యులపై అనుమానాలు ఎలాంటివి పెట్టుకోవద్దని కోరారు.