పంజాబ్ కొత్త ‘కెప్టెన్’ సిద్దూ ?

పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామాతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొత్త ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అమరీందర్ సింగ్ రాజీనామా చేసిన కొద్ది సేపటికే, ముందుగానే నిర్ణయించిన ప్రకారం కాంగ్రెస్ శాసన సభా పక్షం (సీఎల్‌పీ) సమావేశం జరింగింది. నిజానికి, ముఖ్యమంత్రి, సీఎల్‌పీ నాయకుడు అమరీందర్ సింగ్’కు తెలియకుండానే, సీఎల్‌పీ సమావేశం ఏర్పాటు చేయడమే, అమరీందర్ రాజీనామా నిర్ణయానికి ఆఖరి కారణమని ఆయనే స్వయంగా చెప్పారు. ఇలా తనకు తెలియకుండా గతంలోనూ అధిష్టానం రెండు సార్లు నేరుగా ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహించిందని అన్నారు.  అయినా  అప్పట్లోనూ  హర్ట్ అయినా సర్దుకు పోయానని చెప్పుకొచ్చారు. కానీ  ముచ్చటగా మూడో సారి కూడా అదే జరగడంతో ... ఆ అవమాన భారాన్ని భరించలేక అయన రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. అదే విషయాన్ని పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి తెలిపారు. ఆమె కూడా అందుకోసమే వెయిట్ చేస్తున్నట్టు ఓకే ... ఇక మీదే ఆలస్యం అన్న ధోరణిలో మాట్లాడడంతో అయన హర్ట్ ఫీలింగ్స్ మరింత భగ్గుమన్నాయి. కెప్టెన్ అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి  రాజీనామా చేశారు. 

కాంగ్రెస్, సంస్కృతీ సంప్రదాయాలను గౌరవిస్తూ, కొత్త ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యతను పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకే అప్పగిస్తూ కాంగ్రెస్ సీఎల్‌పీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. సీఎల్‌పీ సమావేశానంతరం పంజాబ్  కాంగ్రెస్ ఇన్‌చార్జి హరీష్ రావత్ మీడియాతో మాట్లాడుతూ, పార్టీ రెండు తీర్మానాలను కాంగ్రెస్ అధిష్టానానికి పంపిందని, ఈ రెండూ సీఎల్‌పీ సమావేశంలో ఆమోదం పొందాయని చెప్పారు.“ముఖ్యమంత్రిని ఎంపిక చేయాల్సిందిగా కాంగ్రెస్ అధ్యక్షురాలిని కోరడం సంప్రదాయంగా వస్తోంది. పంజాబ్ కాంగ్రెస్ యూనిట్ ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ, కొత్త సీఎం ఎంపిక బాధ్యతను సోనియా గాంధీ అప్పగిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. పార్టీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. సో ... సోనియా ఎవరిని సెలెక్ట్ చేస్తే వారు పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. మిగిలిన నాలుగైదు నెలలు ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. ఇక రెండవ తీర్మానం అమరీందర్ సింగ్’కు కృతజ్ఞతాపూర్వకంగా  వీడ్కోలు తెలిపే ఫార్మల్ తీర్మానం. ఈనేపధ్యంలో సోనియా గాంధీ కొత్త ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేస్తారు? అనేది ఇప్పుడు సస్పెన్స్’గా మారింది. అయితే, ఎవరికోసం అయితే, కెప్టెన్’కు ఉద్వాసన్ పలికారో, అదే నవజ్యోతి సింగ్ సిద్దూకు పట్టం కట్టే అవకాసం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సిద్దూ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు అయితే అదే ఆశిస్తున్నారు.  

అయితే, అదే జరిగితే, పార్టీ అధిష్టానం సిద్దూ పేరును ప్రతిపాదిస్తే, తాను ఆ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తానని కెప్టెన్ అమరీందర్ సింగ్ చెప్పారు. ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశమని చెప్పారు. అంతే కాదు, సిద్దూను దేశ ద్రోహిగా పేర్కొంటూ ఇంకా చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు.  ‘‘పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి ఆయన (నవజోత్ సింగ్ సిద్ధూ) పేరును నా దేశం కోసం నేను వ్యతిరేకిస్తాను.ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం. పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు ఆయన స్నేహితుడు. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వాతో సిద్ధూకు సంబంధాలు ఉన్నాయి’’ అని కెప్టెన్ అమరీందర్ సింగ్ చెప్పారు. 

 రాహుల్ గాంధీ ఇప్పటికీ, సిద్దూ వైపే మొగ్గుచూపే అవకాశం ఉందని జతీయ మీడియాలో వస్తున్న కథనాలను బట్టి తెలుస్తోంది. మరో వంక రాహుల్ గాంధీ, 2017 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే అమరీందర్’ స్థానంలో ప్రతాప్ సింగ్ భాజ్వాను  ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించాలని పట్టు పట్టరని, అయితే అప్పట్లో సోనియా గాంధీ పార్టీ సేనియర్లకు విలువ నిచ్చిరాహుల్ ప్రతిపాదనను పకక్న పెట్టారని అంటారు.  అప్పటినించి కూడా రాహుల్ , అమరీందర్  మధ్య ఒక విధమైన రచ్చ సాగుతూనే ఉందని,ఆ పర్యవసానంగానే జూలై లో సిద్దూ పీసీసీ అధ్యక్షుడయ్యారు . అప్పుడు కూడా అమరీందర్ ఇదే విధంగా అభ్యంతరం చెప్పారు. అయినా రాహుల్ గాంధీ, సిద్దూకి పీసీసీ బాధ్యతలు అప్పగించారు. అలాగే, ఇప్పుడు ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యతను సీఎల్‌పీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అప్పగించినా అంతిమంగా నిర్ణయం తీసుకునేది రాహుల్ గాంధీనే కాబట్టి, సిద్దూ, కాదంటే పీసీసీ మాజీ చీఫ్ భజ్వాకు ముఖ్యమంత్రే అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.