కేసీఆర్ సర్కార్ పై  రేవంత్ మరో అస్త్రం ..

అధికారమే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వంపై యుద్దాన్ని ప్రకటించి , వరస బాణాలు సంధిస్తున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సర్కార్ ను ఉక్కిరి బిక్కిరి చేసేందుకు మరో అస్త్రాన్ని సిద్దం చేశారు. దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమం ద్వారా ప్రభుత్వం పరుగులు తీసేలా చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు యువత, విధ్యార్ధులను తమ వైపుకు తిప్పుకునేందుకు, నిరుద్యోగ సమస్య పరిష్కారం కొరుతూ, యువ భేరి మొగించేందుకు సిద్దమయ్యారు. 

నిధులు, నీళ్ళు, నియమకాలే ప్రధాన నినాదంగా సాధించుకున్న తెలంగాణలో, నియామకాల ఊసే లేకుండా పోయింది. నిరుద్యోగులు ఆత్మహత్యలు నిత్య కృత్యంగా మారాయి.. ఎక్కడో అక్కడ తరచూ నిరుద్యోగ యువకులు ఆత్మహత్య చేసుకుంటే ఉన్నాడు. ఇప్పటికే, ఇచుమించుగా 20౦ మందివరకు నిరుద్గ్యోగ యువకులు ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఇది,ఉద్యమ కాలంలో ఆత్మబలిదానం చేసుకున్న 1400 మంది నిరుద్యోగ యువతకు అదనం. ఈ నేపధ్యంలో రేవంత్ రెడ్డి నిరుద్యోగుల పై దృష్టిని కేద్రీకరించారు. అక్టోబరు 2 నుంచి డిసెంబరు 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించాలని, టీపీసీసీ కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌, లేదా వరంగల్‌లో ఒక భారీ బహిరంగ సభను నిర్వహించాలని, దానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ లేదా ఏఐసీసీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని రప్పించాలని నిర్ణయించారు.


టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ దామోదర్‌ రాజనర్సింహ తదితరులు పాల్గొన్న సమావేశంలో ప్రధాన అజెండాగా అక్టోబరు 2 నుంచి డిసెంబరు 9 వరకు తీసుకున్న కార్యక్రమంపైనే చర్చించారు. నోటిఫికేషన్ల నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌, నిరుద్యోగ భృతి వరకు ఈ కార్యక్రమంలో ప్రస్తావించాలనుకున్నారు. ఎన్‌ఎ్‌సయూఐ, యూత్‌ కాంగ్రె్‌సలను భాగస్వాములను చేయాలని నిర్ణయించారు. వర్సిటీలు, విద్యాసంస్థలను సందర్శించి యువతతో చర్చాగోష్ఠి కార్యక్రమాలు నిర్వహించాలని తీర్మానించారు. ఆగస్టు 2 నుంచి డిసెంబరు 9 వరకు ఎప్పుడు ఏ కార్యక్రమం.. ఎలా నిర్వహించాలనే దానిపై మరో సమావేశంలో నిర్ణయిస్తామన్నారు.

పార్టీ పరంగా కార్యక్రమాలు చేపట్టి పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాలు సాగిస్తున్న రేవత్ రెడ్డి మరో వంక తమ పోరాటంలో ఇతర పార్టీలను కలుపుకు పోయేందుకు నడుం బిగించారు. గతంలో కాంగ్రెస్ సారధ్యంలో సాగించిన ఉమ్మడి పోరాటాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఈరోజు (ఆదివారం) వామపక్షాలు సహా పలు పార్టీల నేతలతో  గాంధీభవన్‌లో సమావేశ మవుతున్నారు. ఈ నెల 22న ఇందిరాపార్కు వద్ద నిర్వహించనున్న ధర్నా కార్యక్రమం, 27న భారత్‌ బంద్‌లపైన ఈ సమావేశంలో చర్చించనున్నారని సమాచారం.