గుట్టమీద వ్యభిచారం
posted on Nov 28, 2014 2:44PM
కామాతురాణాం నభయం నలజ్జ అంటారు. ఇప్పుడు ఈ మాటకి ‘న ప్రదేశం’ అని కూడా చేర్చుకోవచ్చు. తమ కామ వాంఛలు తీర్చుకోవడానికి వేరే ప్రదేశాలేవీ లేనట్టుగా కొంతమంది పవిత్రమైన పుణ్యక్షేత్రాలను ఎంచుకుంటున్నారు. తెలంగాణలో పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలోని లాడ్జ్‌లు, హోటళ్ళలో భారీ స్థాయిలో వ్యభిచారం జరుగుతోంది. ఈ సమాచారాన్ని అందుకున్న పోలీసులు శుక్రవారం యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో వున్న హోటళ్ళు, లాడ్జ్‌ల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో 15 జంటల ప్రేమ పక్షులను, పలువురు మహిళలు, విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో దొరికిపోయిన ప్రేమజంటలకు పోలీసులు భారీ క్లాసు తీసుకుని, వారివారి తల్లిదండ్రుల్ని పిలిచి వారిని అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నారు.