యమలీల-2 - స్వీట్... షార్ట్ రివ్యూ

 

తారాగణం: డాక్టర్ కె.వి.సతీష్‌, దియా నికోలస్‌, మోహన్‌బాబు, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, ఎం.ఎస్‌.నారాయణ, పోసాని కృష్ణమురళి, రావు రమేష్‌, సదా, నిషా కొఠారి, ఆశిష్‌ విద్యార్థి, సాయాజీ షిండే, గీతాంజలి, బేబీ హర్షిత, అనంత్‌, సమీర్‌, ఉత్తేజ్‌, జోగి బ్రదర్స్‌, తాగుబోతు రమేష్‌, సత్యకృష్ణ, ప్రియ.

 

సాంకేతిక నిపుణులు: కెమెరా; శ్రీకాంత్‌ నారోజ్‌, ఎడిటర్‌; గౌతంరాజు, మాటలు; గంగోత్రి విశ్వనాథ్‌, భవానీ ప్రసాద్‌,  నిర్మాణం: క్రిష్వీ ఫిలింస్‌, నిర్మాత: ఆశా సతీష్‌, కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం; ఎస్‌.వి.కృష్ణారెడ్డి.

 

ఇరవై సంవత్సరాల క్రితం హాస్యనటుడు అలీని హీరోగా పెట్టి ‘యమలీల’ సినిమాని రూపొందించిన దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ఆ సినిమాకి సీక్వెల్‌గా రూపొందించిన ‘యమలీల-2’ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రిష్ (సతీష్) లుకేమియా కేన్సర్‌కి మందు కనిపెట్టాలని ప్రయత్నించే యంగ్ డాక్టర్. అతను ఎంతో ప్రేమించే తన అన్నయ్య కూతురు బేబీ హర్షిత లుకేమియాతో బాధపడుతూ వుంటుంది. లుకేమియాకు మందు కనిపెట్టి ఆమె ప్రాణాలు కాపాడుకోవాలన్నది క్రిష్ ప్రయత్నం. ఈ ప్రయత్నాల్లో భాగంగా హిమాలయాల్లో వుండే సంజీవని మొక్క కోసం క్రిష్ మానస సరోవరానికి వెళ్తాడు. అప్పటికే అక్కడికి యముడు, చిత్రగుప్తుడు (మోహన్ బాబు, బ్రహ్మానందం) విహారయాత్రకి వచ్చి వుంటారు. చిత్రగుప్తుడు చేసిన పొరపాటు వల్ల అతని దగ్గర ఉన్న భవిష్యవాణి పుస్తకం క్రిష్ చేతికి చిక్కుతుంది. దాన్ని తెరిచి చూసిన క్రిష్‌కి అందులో కనిపించిన విషయాలు షాక్‌కి గురి చేస్తాయి. ఆ తర్వాత క్రిస్ ఏం చేశాడు? భూలోకానికి వచ్చిన యమ, చిత్రగుప్తులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారన్నది ఈ సినిమా కథాంశం. ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ బావుంది. కృష్ణంభజే పాట బావుంది. కామెడీ పర్లేదు.