కడపలో దారుణం... నడిరోడ్డుపై నరికి చంపారు...

 

రాయలసీమలో పాత కక్ష్యలు నేపథ్యంలో రోజుకో హత్య చోటుచేసుకుంటుంది. ఇప్పటికే కర్నూల్ లో వైసీపీ నేత నారాయణ రెడ్డి హత్య కలకలం రేపుతుండగా ఇప్పుడు కడపలో మరో దారుణమైన హత్య చోటుచేసుకుంది. నడిరోడ్డుపై ఓ వ్యక్తిని నరికి చంపారు. వివరాల ప్రకారం.. కడపజిల్లాలోని ప్రొద్దుటూరు కోర్టు వద్ద దేవగుడి గ్రామానికి చెందిన బోరెడ్డి మారుతీరెడ్డి(32)ని ప్రత్యర్ధులు అతి దారుణంగా వెంటాడి మరీ నరికి చంపారు. అతని పాతకేసులు సంబంధించి ప్రొద్దుటూరు కోర్టుకు హాజరయ్యేందుకు వస్తుండగా ప్రత్యర్థులు మాటువేసి హత్య చేశారు. కోర్టు ఎదురుగా ఆటో దిగగానే మారుతీరెడ్డిని నలుగురు వ్యక్తులు వెంటబడి దారుణంగా నరికి చంపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటికే ఇద్దరు నిందుతులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu