‘నీతి ఆయోగ్’ తొలి సమావేశం నేడే
posted on Feb 8, 2015 10:14AM
.jpg)
ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు డిల్లీ చేరుకొంటున్నారు. ఇన్నేళ్ళుగా ఉన్న ప్రణాళికా సంఘంలో రాష్ట్రాల పాత్ర నామ మాత్రంగా ఉండేది. ప్రధాని నరేంద్ర మోడీ ఆ లోపాన్ని సవరిస్తూ ప్రణాళికా సంఘం స్థానంలో ‘నీతి ఆయోగ్’ ఏర్పాటు చేసి అందులో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను భాగస్వాములుగా చేసారు. వారందరూ తమ తమ రాష్ట్రాలు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలను, రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకొని తమ తమ రాష్ట్రాల అభివృద్ధికి అవసరమయిన ప్రతిపాదనలు సమర్పిస్తారు. వాటి ఆధారంగా ‘నీతి ఆయోగ్’ ఒక సమగ్ర ప్రణాళిక తయారు చేస్తుంది. దాని ఆధారంగానే కేంద్రం బడ్జెట్ కేటాయింపులు చేస్తుంది. ఈ విధానాన్ని సక్రమంగా అమలుచేయగలిగితే దేశంలో అన్ని రాష్ట్రాలు సమానంగా అభివృద్ధి సాధించే అవకాశం ఉంటుంది. తద్వారా యావత్ దేశం అభివృద్ధి చెందే అవకాశం ఉంది.