రాష్ట్రపతి వోటర్లలో 31 శాతం క్రిమినల్సే

 భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యదేశం. ఈనెల 19వ తారీఖున మనం 13వ రాష్ట్రపతిని ఎన్నుకోబోతున్నాం. ఈ ఎన్నికకు ప్రజలంతా పరోక్షంగా మాత్రమే పాల్గొంటారు. అంటే మన ఎంఎల్‌ఏలు యంపిలు మన తరఫున రాష్ట్రపతి ఎన్నికల్లో వోట్లు వేయబోతున్నారు. ఇలా వోట్లు  వేయబోతున్న వారిలో  31 శాతం మంది క్రిమినల్స్‌ అని వారిపై అనేక కేసులు ఉన్నాయని స్వయానా వారు  సమర్పించిన అఫిడవిట్లే చెబుతున్నాయి. వీరిలో 141 మంది పై మర్డర్‌కేసులు , 90 మందిపై  కిడ్నాప్‌ కేసులు ఉన్నాయి.


 

మొత్తం 641 మందిపై  సీరియస్‌ క్రిమినల్‌ కేసులు  అంటే రేప్‌ , మర్డర్‌, కిడ్నాప్‌ ,దోపిడీల వంటి కేసులు ఉన్నాయి. 6 గురు ప్రజాప్రతినిధులు రేప్‌కేసుల్లో ఉన్నారు. 352 మంది మీద మర్డరు కేసులు నమోదయ్యాయి. 141 మంది మర్డరు కేసుల్లో సహా నిందితులు.145 మందిపై దొంగతనం కేసులు  ,90 మందిపై  కిడ్నాప్‌ కేసులు ఉన్నాయి. వీరిలో  75 మంది కోర్టు తీర్పులో దోపిడిదొంగలుగా నిర్ధారించబడ్డవారే. ఈ క్రిమినల్‌ పొలిటీషన్‌లలో ఎక్కవ మంది బీహార్‌, ఉత్తర ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లకు చెందిన వారే కావడం విశేషం ప్రజాప్రతినిధుల్లో 48 శాతం మంది కోటీశ్వరులే. ఈ కోటీశ్వరుల్లో మన రాష్ట్రానికి చెందిన వారు 15 మంది ఉన్నారు. అంటే వచ్చే రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్దుల భవితవ్యాన్ని నేరస్తులు, కోటీశ్వరులే నిర్నయించోతున్నారన్నమాట!