మేము ఏమైనా కుక్కల్లా బతుకుతున్నామా మోడీజీ...
posted on May 7, 2018 2:44PM
గత కొద్దికాలంగా ప్రధాని నరేంద్ర మోడీపై నటుడు ప్రకాష్ రాజ్ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి తనదైన శైలిలో తన ట్విట్టర్ ఖాతా ద్వారా మోడీపై కామెంట్లు వేశారు. ‘డియర్ ప్రైమ్ మినిస్టర్ .. మనుషుల కన్నా ముధోల్ శునకాలు బాగా పనిచేస్తాయని.. వాటిని ఆర్మీలో రిక్రూట్ చేసుకునే విషయమై చర్చిస్తానని మీరు అన్నారు. అయితే, కుక్కలు ఓట్లు వేయవు కదా.. ఉద్యోగాల కోసం యువత కలలు కంటోంది.. రైతులు ఆవేదనలో ఉన్నారు .. ఓటు వేయడం ద్వారా మెరుగైన జీవితాన్ని పౌరులు కోరుకుంటున్నారు. కర్ణాటక ప్రజలు అంతా గమనిస్తున్నారు.. మేము ఏమైనా కుక్కల మాదిరి బతుకుతున్నామని మీరు అనుకుంటున్నారా..జస్ట్ ఆస్కింగ్’ అని మోదీపై ప్రకాష్ రాజ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అంతేకాదు... మరో ట్వీట్ లో.. ‘ ఏ మేరకు అబద్ధాలు ఆడాతారు సార్.. విద్యుత్ తో కాదు.. మీరు చెప్పే అబద్ధాలతో మమ్మల్ని షాక్ కు గురిచేస్తున్నారు. మీకో సింపుల్ ప్రశ్న వేస్తున్నా! దేశంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో మీరు మర్చిపోయారు.. పౌరులు ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతారు. కనీసం, ఇప్పటివరకు మీరు ఎన్ని అబద్ధాలు చెప్పారో ఆ సంఖ్య అయినా గుర్తుందా..?’ అని విమర్శలు గుప్పించారు.