రాజకీయాలకు వేదికగా ప్రజాపథం!
posted on Apr 19, 2012 11:14AM
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నా ప్రజాపథకం నేతల రాజకీయాలకు వేదికగా మారింది. ప్రజా సమస్యల పరిష్కారం, పాలనా యంత్రాంగాన్ని ప్రజల ముంగిటకు తీసుకువెళ్ళడం ప్రజాపథం ప్రధాన లక్ష్యం. ప్రజాపథం ద్వారా అధికారపార్టీ నేతలు తెల్లకార్డులు, పింఛన్లు పంపిణీ మొదలుకొని పక్కాగృహాలు మంజూరు వరకు ఈ కార్యక్రమంలోనే లబ్దిదారులను ఎంపిక చేసుకోవాల్సి వుంటుంది.
కాని వాస్తవంలో అధికారపార్టీ నేతలు మొదలుకొని ప్రతిపక్ష నేతల వరకు ఈ పతకాన్ని తమ వ్యక్తిగత ప్రచారం కోసం వినియోగిస్తున్నారు. ప్రజాపథంలో ఎంత గొడవ జరిగితే నేతలకు అంతబాగా ప్రచారం లభిస్తుందనే ధోరణి కనిపిస్తోంది. ప్రభుత్వపరంగా తాము ఇన్నివేల కోట్ల రూపాయలు ఖర్చుచేశామని చెప్పే ప్రయత్నం అధికారపక్ష నేతలు ప్రయత్నిస్తుంటే గతంలో చేసిన ఒక వాగ్దానం కూడా నెరవేరలేదని, గతంలో స్వీకరించిన వినతిపత్రాలన్నీ చెత్తబుట్టలో వేశారంటూ ప్రతిపక్షనేతలు వ్యాఖ్యానించడమే కాదు విజయవాడ, తిరుపతి, గుంటూరు, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో వ్యక్తిగతంగా ఒకరి మీద ఒకరు దాడిచేసుకోవడానికి కూడా సిద్ధం అవుతున్నారు.