పవన్ ఫ్యాన్స్, పూనమ్ కౌర్, నాగార్జున, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ..అసలు నిజం ఏంటి

ఎంకి పెళ్లి సుబ్బిచావు కొచ్చిందనే సామెత ఇప్పుడు నాగార్జున(nagarjuna)పూనమ్ కౌర్(poonam kaur)పవన్ కళ్యాణ్(pawan kalyan)ఫ్యాన్స్, అల్లు అర్జున్(allu arjun)ఫ్యాన్స్ విషయంలో మరోసారి రుజువయ్యింది.అసలే  సినీప్రముఖులు, సినీ అభిమానులు హీరోల ఫ్యాన్స్ మధ్య వైరం ఉండటం సినిమాకి మంచికాదని కోరుకుంటు ఆ వైరాన్ని పోగొట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి టైంలో మళ్ళీ ట్వీట్ ల రచ్చ  మొదలయ్యింది. పూర్తి  మ్యాటర్ ని చూద్దాం.   

మొన్న ఆగస్టు 29 న యువసామ్రాట్ నాగార్జున పుట్టినరోజు సందర్భంగా పూనమ్ కౌర్ ఒక ట్వీట్ చేసింది. నాగార్జునతో తీసుకున్న ఫొటోను షేర్ చేస్తూ ఎప్పటికీ అందగాడైన నాగ్ సార్‌కి హ్యాపీ బర్త్‌డే. ప్రస్తుత కష్టకాలం కదిలిపోయే మేఘంలా పోయి సూర్యోదయం లాంటి ఆనందం మీకు త్వరలోనే రావాలని కోరుకుంటున్నట్టు  ట్వీట్ చేసింది. దీంతో ఒక నెటిజన్    ఏదైనా పని చూసుకొని బిజీ అవ్వొచ్చుగా పూనమ్. అస్తమానం ఇలా ట్విట్టర్‌లో ఎవరో ఒకరి గురించి ట్వీట్లు పెట్టడమే పనా! వెళ్లి జీవితానికి ఉపయోగపడే పని చూడు. పో ఇక్కడి నుంచి   అంటూ  కామెంట్ చేశాడు. ఇక అంతే  పూనమ్ కూడా  వెంటనే కౌంటర్ ఇచ్చింది. అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడటమే ఓ యాక్టివిస్ట్‌గా నా పని. అయినా నా దగ్గరి నుంచి అంతా దోచేసిన తర్వాత, లాగేసుకున్న తర్వాతే  ఈ పనిలోకి దిగాను. అయినా నా విషయంలో మీరు ఎంత క్రూరంగా ఉన్నారు.నువ్వు ఇక్కడికెందుకు వచ్చావు. నువ్వు  కూడా జీవితానికి ఉపయోగపడే పని చూసుకో అంటూ స్ట్రాంగ్ గానే  కౌంటర్ ఇచ్చింది.

ఇంత వరకు బాగానే ఉంది. కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇప్పుడు ఈ విషయం మీద రంగంలోకి దిగారు. పవన్  కళ్యాణ్ ఫ్యాన్స్‌కి పనేం లేదా ఎప్పడు చూసినా ఆడవాళ్లను ఏదో ఒకటి అనడమే వీళ్లకి ఆనందం అంటూ  కామెంట్లు చేస్తున్నారు.  ఇంకేముంది మళ్ళీ  మెగా అండ్ అల్లు వర్సస్ వార్  షురూ అయిపోయింది. సోషల్ మీడియా వేదికగా రకరకాల కామెంట్స్ తో ట్వీట్స్ యుద్ధానికి దిగారు. ఇక ఎంటైర్ ఈ విషయంలో ఉన్న ట్విస్ట్ ఏంటంటే పూనమ్ కి ట్వీట్ చేసిన వ్యక్తి ఒక కామన్ మాన్. పవన్ ఫ్యాన్ అని ఎక్కడ చెప్పలేదు. కానీ మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ ట్వీట్ల వార్ లో కి దిగారంటే  గ్యారంటీగా ఇది వేరే వాళ్ళ పనే అనే కామెంట్స్  వినిపిస్తున్నాయి.