ఆంధ్రప్రదేశ్‌లో నిద్రమొహం అధికారులు!
posted on Sep 14, 2024 5:44PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నిద్రమొహం అధికారులు ఎక్కువైపోయారు. జగన్ ఐదేళ్ల పాలనలో నిద్రపోతూ టైమ్‌పాస్ చేసిన చాలామంది అధికారగణం చంద్రబాబు ప్రభుత్వంలో కూడా అదే నిద్రని కంటిన్యూ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి తమ నిద్రని డిస్ట్రబ్ చేసిందని హర్టవుతున్న అధికారులు కూడా ఆంధ్రప్రదేశ్‌లో దండిగా వున్నారు. అందుకే ఏపీలో అనేక ప్రభుత్వ శాఖల అధికారులు ఇంకా జగనే సీఎంగా వున్నారన్న కలలు కంటూ హాయిగా నిద్రపోతున్నారు. అందువల్లనేనేమో ప్రభుత్వ శాఖలకు చెందిన చాలా వెబ్‌సైట్స్.లో హోమ్ పేజీలో ముఖ్యమంత్రి ఫొటో అయితే మారింది. అయితే లోపలి పేజీల్లో మాత్రం ఇప్పటికీ జగన్ ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు, జగన్ ప్రభుత్వం పథకాలకు సంబంధించిన వివరాలే వుంటున్నాయి. అంటే, మొక్కుబడిగా హోమ్ పేజీలో వివరాలు మార్చారు. లోపల ఎవరు చూస్తార్లే అనుకున్నారే ఏంటోగానీ, జగన్ ప్రభుత్వం తాలూకు పీడకలలే ఆయా పేజీల్లో కనిపిస్తున్నాయి. అలాగే ప్రజలకు జారీ చేసే కీలకమైన ప్రభుత్వ రికార్డుల మీద కూడా ఇంకా జగన్ ఫొటోనే దర్శనమిస్తోంది. ప్రభుత్వ రికార్డులతోపాటు ధ్రువీకరణ పత్రాలు, భూమి డాక్యుమెంట్లు, సర్టిఫికెట్ల మీద జగన్ ఫొటో ఇప్పటికీ దర్శనమిస్తోంది. మరి ప్రభుత్వ అధికారులు ఎప్పుడు నిద్ర లేస్తారో... చంద్రబాబుని ముఖ్యమంత్రిగా ఎప్పుడు గుర్తిస్తారో!