కౌశిక్ రెడ్డిని పరామర్శించిన కెటీఆర్
posted on Sep 14, 2024 2:31PM
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ ఇవ్వాళ పరామర్శించారు. శనివారం మధ్యాహ్నం కౌశిక్ రెడ్డి నివాసానికి రావడం చర్చనీయాంశమైంది. కౌశిక్ రెడ్డి పై దాడి జరగడంతో బిఆర్ఎస్ నేతలు చేసిన ఫిర్యాదు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అరికెపూడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసింది. అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ పదవిని రేవంత్ రెడ్డి ఇవ్వడంతో బిఆర్ఎస్ లో నిప్పు రాజేసింది. దీనికి తోడు అరికెపూడి, కౌశిక్ రెడ్డి మధ్య మాటలయుద్దం బిఆర్ఎస్ లో మరింత నిప్పు రాజేసింది.
తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి బిఆర్ఎస్ ప్రయోజనం పొందాలని చూస్తుందా? అంటే ఔననే అనినిపిస్తుంది. అరికెపూడిని దూషిస్తూ రెచ్చగొట్టిన కౌశిక్ రెడ్డి తెలంగాణ సెంటిమెంట్ మరోమారు రెచ్చగొడుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రయోజనం పొందడానికే కౌశిక్ రెడ్డి ఇలా వ్యాఖ్యలు చేశారని వినిపిస్తోంది