అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై మరికొద్ది సేపట్లో తీర్పు
posted on Jan 3, 2025 12:29PM
అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై మరి కొద్ది సేపట్లో తీర్పు రానుంది. సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడం ఆమె కుమారుడు ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో అల్లు అర్జున్ గత నెల 13న అరెస్ట్ అయ్యారు. 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే అల్లు అర్జున్ అడ్వకేట్లు కోర్టులో వాదించి మధ్యంతర బెయిల్ ఇప్పించారు. అల్లు అర్జున్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు వాదనల అనంతరమే బెయిల్ మంజూరైంది. అరెస్ట్ అయిన మరుసటి రోజే అల్లు అర్జున్ విడుదలయ్యారు. అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో వాదనలు ముగిసాయి. గత నెల 26న రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలైంది.