ఫ్లాష్.. ఫ్లాష్.. పిన్నెల్లి అరెస్టు

వైసీపీ నేత పిన్నెల్లిని పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి సమీపంలోని ఇస్నాపూర్ లో పోలీసులు  పిన్నెల్లిని అరెస్టు చేశారు.  మాచర్ల వైసీపీ అభ్యర్థి అయిన పిన్నెల్లి పోలింగ్ రోజున విధ్వంసానికి పాల్పడటంతో పోలీసులు ఆయనను హౌస్ అరెస్టు చేశారు. అయితే హౌస్ అరెస్టు నుంచి తప్పించుకుని ఆయన పరారయ్యారు. ఆ తరువాత తాపీగా సొంత పనిమీద హైదరాబాద్ వచ్చినట్లు సామాజిక మాధ్యమం ద్వారా ఓ ప్రకటన జారీ చేశారు.

అదలా ఉంచితే తాజాగా ఆయన పోలింగ్ రోజున ఓ పోలింగ్ బూత్ లోకి జొరబడి ఈవీఎంను ధ్వంసం చేయడానికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఆయనపై క్రిమినల్ కేసు బుక్ చేసి అరెస్టు చేయాలని ఆదేశించింది. సాయంత్రం ఐదు గంటల లోగా ఆయనను అరెస్టు చేయాలని పేర్కొనడంతో పోలీసులు పిన్నెల్లి కోసం వేట మొదలు పెట్టారు.

తొలుత మధ్యాహ్నం ఆయన కారు డ్రైవర్ ను అరెస్టు చేశారు. ఆయన కారును, అందులోని సెల్ ఫోన్ నూ స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత కొద్ది సేపటికే పిన్నెల్లి సంగారెడ్డి ఇస్నాపూర్ లో పోలీసులకు చిక్కారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu