తిరుమలలో ప్లాస్టిక్ రీ సైక్లింగ్ యూనిట్!

తిరుమలలో ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ ప్రారంభమైది. తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు సీఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి ఈ ప్లాస్టిక్ రీ సైక్లింగ్ యూనిట్ ను పరిశీలించారు. రిక్లైమ్ ఏస్ యంత్రం పనితీరును పరిశీలించారు.

ఈ యూనిట్ ప్రారంభంతో ఇకపై కొండ మీద ట్రెట్రా ప్యాక్స్, స్నాక్ ప్యాకెట్ల వల్ల ఎటువంటి ఇబ్బందీ ఉండదని అంటున్నారు. ప్లాస్టిక్ కంటెంట్ ను భక్తులు ఈ యూనిట్ లో వేసేయవచ్చు. ఇందు కోసం యూపీఐ ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తరువాత క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయల్సి ఉంటుంది. ఇలా ప్లాస్టిక్ వేసిన వారికి ఐదు రూపాయలు ఇస్తారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu