ఇద్దరు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్‌చిట్‌

 

ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నారు. శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్యలు పార్టీ మారారనడానికి తగిన ఆధారాలు లేవని అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. గత నెలల్లో పార్టీ ఫిరాయింపుకు సరైన ఆధారాలు లేవని ఐదుగురు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 

మరోవైపు కడియం శ్రీహరి, దానం నాగేందర్, సంజయ్‌కుమార్ తమ అనర్హతపై ఇంక సభాపతికి వివరణ ఇచ్చుకోలేదు. బీఆర్ఎస్‌ పార్టీ నుంచి గెలిచి..  10మంది ఎమ్మెల్యేలు తాము కాంగ్రెస్ పార్టీలో చేరలేదని.. ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని.. ప్రతీ నెలా బీఆర్ఎస్‌ఎల్పీకి చందాలు చెల్లిస్తున్నామని తెలిపారు. ఇక నియోజకవర్గ అభివృద్ధి కోసమే.. సీఎం రేవంత్‌ను కలిశామని వారు తెలిపారు
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu