అభిమానితో పవన్ సెల్ఫీ... ఆ అభిమాని ఎవరో తెలుసా..?

 

తమ అభిమాన హీరోలతో ఫ్యాన్స్ సెల్ఫీలు తీసుకుంటారు అది అందరికీ తెలిసిన విషయమే. కానీ తన అభిమానితోనే సెల్ఫీ తీసుకొని అందరినీ ఆశ్చర్యపరిచాడు పవన్. నిజానికి పవన్ తన అభిమానులను ఎంతగా ఆదరిస్తారో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. మరి ఇంతకీ పవన్ సెల్ఫీ దిగిన ఆవ్యక్తి ఎవరూ.. ఎవరా అభిమాని అనుకుంటున్నారా..? అతనెవరో కాదు.. నిమ్మ‌ల వీర‌న్న. ఇంతకీ నిమ్మల వీరన్న ఎవరనుకుంటున్నారా..? ఓ సామాన్యుడు. సమాజంలో మార్పుకోసం ఏళ్లుగా కృషి చేస్తున్న ఓ కామన్ మ్యాన్. దేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలనీ… స్వచ్ఛమైన రాజకీయ వ్యవస్థ రావాలని కోరుకుంటున్న ఓ సాధారణ పౌరుడు. దానికోసం ఇరవై ఏళ్లుగా గోడల మీద నినాదాలను రాస్తూ… జనంలో చైతన్యం తీసుకురావడానికి కృషి చేస్తున్న పౌర సైనికుడు. ఆయన జనసేన సిద్ధాంతాల పట్ల.. పవన్ కల్యాణ్ ఆలోచన తీరుపట్ల ఆకర్షితులయ్యారు. జనసేన కార్యకర్తగా పనిచేస్తున్నారు.

 

ఈ నేపథ్యంలో జనసేన పార్టీ కార్యలయం ప్రారంభంలో నిమ్మల వీరన్నను పవన్ ముఖ్య అతిధిగా పిలిచారు. ఈ సందర్భంగా పవన్ వీరన్నతో ఓ సెల్పీ దిగారు. ఇక ఆసెల్ఫీని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘సామాజిక, ఆర్థిక ప‌రివ‌ర్త‌న కోసం నిరంత‌రం ప‌నిచేసే, అలుపెరుగ‌ని కార్య‌క‌ర్త మా నిమ్మ‌ల వీర‌న్న‌తో..’అని కూడా రాశారు. దీంతో మరోసారి పవన్ తన ప్రత్యేకతను చాటుకున్నారు.