సర్వమత ప్రార్థనలమధ్య జనసేన ఆఫీస్ ప్రారంభం...
posted on Oct 25, 2017 10:51AM
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో పార్టీ కార్యలయాన్ని ప్రారంభించారు. తొలుత భరతమాతకు పూజలు చేసి.. అనంతరం సర్వమత ప్రార్థనలు చేసారు. శాస్త్రోక్తంగా వేదమంత్రాల మధ్య జనసేన ముఖ్య ప్రతినిధులు, అభిమానులు వెంట రాగా కార్యాలయంలోకి అడుగుపెట్టారు. ఆతరువాత...ముస్లీం మత పెద్దలతో పాటు ప్రముఖ నటుడు అలీ దివ్య ఖురాన్ పఠించారు. క్రిస్టియన్ మత పెద్దలు బైబిల్‌లోని పవిత్ర స్త్రోత్రాలను పఠించి పవన్ కళ్యాణ్‌ను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ..పార్టీ పరిపాలనా సౌలభ్యం కోసం ఈ ప్రాంగణం పని చేస్తుందని, పార్టీ రాజకీయ కార్యకలాపాల కోసం త్వరలో హైదరాబాద్, అమరావతిలలో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కాగా తెలంగాణకు చెందిన జనసేన కార్యకర్త నిమ్మల వీరన్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వీరన్న మాట్లాడుతూ... ప్రస్తుతం యువకులు, విద్యార్థులను రాజకీయాలకు దూరంగా ఉంచుతున్నారని.. నిస్వార్థంగా పని చేసే రాజకీయ నాయకత్వం దేశానికి అవసరమని, అలాంటి నాయకత్వ రూపకల్పనకు పవన్ కళ్యాణ్ కృషి చేయాలని నిమ్మల వీరన్న విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో పవన్ సన్నిహితులు త్రివిక్రమ్, అలీ కూడా పాల్గొన్నారు.