ఘనంగా పాస్టర్ ప్రవీణ్ పగడాల అంత్యక్రియలు 

అనుమానా స్పదస్థితిలో మృతి చెందిన పాస్టర్ పగడాల ప్రవీణ్  అంత్యక్రియలు ఘనంగా జరిగాయి. పాస్టర్  భౌతిక  కాయాన్ని సికింద్రాబాద్  సెంటినరీ బాపిస్ట్ చర్చిలో  గురువారం సాయంత్రం( మార్చి 27) వరకు ప్రజల సందర్శనార్థం ఉంచారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పాస్టర్ పగడాల మృతిపై క్రైస్తవ సంఘాలు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. అంత్యక్రియల్లో పాస్టర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.  హైద్రాబాద్ నుంచి పశ్చిమగోదావరి జిల్లా రాజమహేంద్రవరంకు   బయలుదేరిన  పాస్టర్  నిన్న కొవ్వూరు సమీపంలో రోడ్డు పక్కన అనుమానాస్పద స్థితిలో మరణించారు. గురువారం సాయంత్రం సికింద్రాబాద్ తిరుమలగిరిలో అంత్యక్రియలు జరిగాయి. పాస్టర్ ప్రవీణ్ అభిమానులు పెద్ద ఎత్తున అంత్యక్రియల్లో పాల్గొన్నారు.  ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.