సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి వద్ద  ఆందోళన

సికింద్రాబాద్​ కుమ్మరిగూడ ముత్యాలమ్మ ఆలయం వద్ద ధార్మిక సంఘాల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. అమ్మవారి విగ్రహ ధ్వంసానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. మహంకాళి ఆలయం వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ఈ క్రమంలో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తీవ్ర తొక్కిసలాట జరిగింది. తమను అడ్డుకున్న పోలీసులపై నిరసనకారులు చెప్పులు విసిరారు. ఆందోళన చేస్తున్న హిందూ సంఘాల శ్రేణులకు డీసీపీ రష్మీ పెరుమాల్​ నచ్చజెప్పిన ఫలితం లేకుండా పోయింది. చివరకు పోలీసులు నిరసనకారులపై లాఠీఛార్జ్​ చేశారు.