తెలంగాణ సచివాలయం వద్ద గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళన 

గ్రూప్ 1 అభ్యర్థులను   బిఆర్ఎస్ పరామర్శించినప్పటికీ ఆందోళన కారుల నుంచి సంఘీభావం

వం రాలేదు ఈ  సంఘటన తెలంగాణ సచివాలయం దగ్గర జరిగింది. గ్రూప్ 1 అభ్యర్థులు సచివాలయం ఎదుట బైఠాయించారు. గ్రూప్ 1 పరీక్షలను  వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ శనివారం సచివాలయం ఎదుట గ్రూప్ 1 అభ్యర్థులు బైఠాయించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నేత బండి సంజయ్ ను అరెస్ట్ చేశారు. ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేపట్టిన ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. సచివాలయం గేట్లను మూసివేశారు గ్రూప్ -1 అభ్యర్థుల పోరాటం  కంటిన్యూ అవుతోంది.  మెయిన్స్ పరీక్ష వాయిదా వేయాలంటూ మరోసారి ఆందోళనకు దిగారు. ర్యాలీగా సచివాలయానికి బయలుదేరారు. తెలుగుతల్లి ప్లై ఓవర్ వద్ద వీరికి బీఆర్​ఎస్, బీజేపీ నేతలు మద్దతు పలికారు. అయితే ఈ సమయంలో బీఆర్​ఎస్ నేతలకు చేదు అనుభవం ఎదురైంది.  బీజేపీ, బిఆర్ ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. సచివాలయానికి ర్యాలీగా వెళ్తున్న గ్రూప్‌ వన్‌ అభ్యర్థులకు మద్దతుగా వచ్చిన  బిఆర్ ఎస్ నాయకులు శ్రీనివాస్‌గౌడ్‌, ప్రవీణ్‌కుమార్‌లను గ్రూప్‌వన్‌ అభ్యర్థులు అడ్డుకున్నారు. గులాబీ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గో బ్యాక్‌అంటూ నినాదాలు చేశారు. ఇదే సమయంలో అక్కడకు బీజేపీ నేతలు రావడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. ఇదిలా వుండగా  కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా అక్కడకు చేరుకున్నారు. గ్రూప్‌1 మెయిన్స్‌ పరీక్షపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఆందోళనలో ఉన్న విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తారని ఆయన ప్రశ్నించారు. జీవో 29పై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు