మంట పుట్టిస్తున్న పాకిస్థానీ హెయిర్ స్టైలిస్ట్‌..

 


ఈరోజుల్లో ప్రతిఒక్కరికీ ఫ్యాషన్ గురించి చెప్పనక్కర్లేదు. రోజుకో ఫ్యాషన్ వస్తుంది. ఇంక హెయిర్ స్టైల్స్ గురించి చెప్పనక్కర్లేదు. జుట్టు ఉన్న ప్రతి ఒక్కరూ రోజుకో స్టైల్ తో మెరుస్తున్నారు. అందుకు త‌గిన‌ట్లే హెయిర్ స్టైలిస్టులు కూడా పుట్టుకొచ్చారు. కానీ ఇక్కడ ఓ హెయిర్ స్టైలిస్ట్‌ మాత్రం జుట్టుకే ఏకంగా మంటే పెట్టేస్తున్నాడు. అయితే ఈ  స్టైలిస్ట్‌ మన దేశానికి చెందిన వ్యక్తి కాదు.. పాకిస్థాన్ కు చెందిన వ్యక్తి. ఒమ‌ర్ ఖురేషీ అనే పాకిస్థాన్ జ‌ర్న‌లిస్ట్ ఈ వెరైటీ హెయిర్ క‌ట్‌కు సంబంధించిన వీడియోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు. ఆ వీడియో లో  హెయిర్ స్టైలిస్ట్ ఏదో ఒక పౌడ‌ర్‌, కాస్త ఆయిల్ వేసి లైట‌ర్‌తో జుట్టుకు మంట పెడుతున్నాడు. ఆ త‌ర్వాత వేగంగా రెండు చేతుల‌తో దువ్వుతూ ఆ మంట‌ల‌ను ఆర్పేస్తున్నాడు. అయితే విచిత్రమేంటంటే మంట పెట్టినా కూడా జట్టుకు మాత్రం ఏం కాకపోవడం. ఇదిలా ఉంటే ఈవీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. మరి ఈ మంటవల్ల వచ్చిన లాభం ఏంటో అత‌నికి, చేయించుకునేవాళ్ల‌కే తెలియాలి మరి.