అనాథ బాలికలను  ప్రేమ పేరిట వ్యభిచార రొంపిలో దించి..

జన్మత:  ఎవరూ నేరస్థులు కారు.  వారికి  చెడు వ్యసనాలు ఉండనే  ఉండవు. మెల్లి మెల్లిగా పక్క దారులు పడుతుంటారు.  ఆయా  కుటుంబాల  ఫైనాన్షియల్ సిచ్యుయేషన్  వారిని నేరస్థులుగా మార్చేస్తుంది. వారిని నేర ప్రవృత్తిలో దించిన ముఠా గుట్టును  తెలంగాణలోని  వరంగల్ పోలీసులు రట్టు చేశారు. 
 అనాథ బాలికలే లక్ష్యం గా ఈ ముఠా గతకొన్నేళ్లుగా పని చేస్తోంది. బాలికలను పడుపు వృత్తిలో ఓ పద్దతి ప్రకారం దించేస్తుంది. అనాథ బాలికలను కొందరు యువకులు ట్రాప్ చేసి ప్రేమపేరిట  దగ్గరవుతుంటారు. అబ్బాయిలను పూర్తిగా నమ్మిన బాలికలు వాళ్లు ఏది చెబితే అది వినే పరిస్థితిలోకి వెళ్లిపోతారు.  అమ్మాయిల  బర్త్ డేలను సాకుగా చేసుకుని విలువైన గిప్ట్ లను ఇచ్చి రొంపిలో దించుతారు. ఈ యువకులు బాలికలకు గంజాయి అలవాటు చేస్తారు. గంజాయి మత్తులో ఉన్న అమ్మాయిలను రేప్ చేస్తారు. రేప్ చేసి వీడియోలు చిత్రీకరిస్తారు. ఈ వీడియోలు చూపిస్తూ తమ కామవాంఛ తీర్చుకోవడమే గాక వ్యభిచారం చేయిస్తారు. ఎదురు తిరిగితే వీడియోలు సోషల్ మీడియాలో పెడతామని  బెదిరిస్తారు.  అమ్మాయిలను మెల్లిగా పడుపు వృత్తిలో దింపి  డబ్బులు సంపాదించడం వారి టార్గెట్. కాసులకు కక్కుర్తి పడి అమ్యాయిల జీవితాలను నాశనం చేస్తున్న ముఠాను వరంగల్ పోలీసులు పట్టుకున్నారు.  ఈ ముఠా నాయకురాలు ఓ మహిళ కావడం విశేషం. హనుమకొండ జిల్లా దామెర మండలం ల్యాదెల్ల గ్రామానికి చెందిన ముస్కులత (38) ఈ ముఠాకు సూత్రధారి. అబ్దుల్, అప్నాన్, షేక్ సైలానీబాబా, మహమ్మద్ అల్తాఫ్,  గంజాయి స్మగ్లర్ వదూద్ పాత్రధారులు. వీరిని తన ముఠాలో చేర్చుకుని  వ్యభిచార కార్యకలపాలు సాగించింది. అనాథ బాలికలను తెలుగు రాష్ట్రాల్లో వ్యభిచారం చేయిస్తున్న ఈ ముఠా ను పోలీసులు చాకచర్యంగా పట్టుకున్నారు. కనిపించకుండా పోయిన  ఓ బాలిక తల్లిదండ్రులు మీల్స్ కాలనీ పోలీసులకు ఈ నెల 11న ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు  ప్రారంభించిన పోలీసులకు లత అరసవెల్లిలో పట్టుబడింది. ఆమె చెరలో ఉన్న బాలికలను పోలీసులు విడిపించారు. ముఠా నుంచి ఓ కారు, 75 వేల నగదు, 18 కిలోల గంజాయి, 4,300 కండోమ్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఈ వివరాలను వెల్లడించారు.