‘ఓకే బంగారం’ షార్ట్ రివ్యూ
posted on Apr 17, 2015 11:41AM
ఆయన అద్భుతమైన దర్శకుడు.. కానీ ఇటీవలి కాలంలో వరుసగా ఫెయిల్యూర్స్‌ని ఎదుర్కొంటున్నారు. ఆయన ఎవరో అందరికీ తెలుసు.. మణిరత్నం. ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘ఓకే బంగారం’ సినిమా శుక్రవారం నాడు విడుదలైంది. ఆ సినిమా ఎలా వుందో చూద్దాం.
ముంబై బ్యాక్‌డ్రాప్‌తో జరిగే సినిమా ఇది. తమ జీవితాలను ఎంతో ప్రేమించే, ఎన్నో యాంబిషన్లు వున్న ఆది, తార అనే అమ్మాయి - అబ్బాయి కథ ఇది. విదేశాలలో స్థిరపడాలని అనుకునే వీరిద్దరూ అనుకోకుండా ఒకరినొకరు కలుస్తారు. ఇద్దరూ సహజీవనం చేస్తూ వుంటారు. వీరిద్దరూ ప్రకాష్ రాజ్, లీలా థామ్సన్ ఇంటిలో వుంటారు. కథ ఇలా జరుగుతూ వున్న సమయంలో కొన్ని మలుపులు వస్తాయి. ఆ మలుపుల కారణంగా అప్పటి వరకూ వారిద్దరిలో వున్న మైండ్ సెట్ మారే పరిస్థితులు కూడా వస్తాయి. తమ సహజీవనాన్ని కొనసాగించాలా వద్దా అనే పరిస్థితులు వీరికి ఎదురవుతాయి. చివరికి ఏమైందనేదే ఈ సినిమా కథాంశం.
ఈ సినిమా హీరో దల్కీర్ సల్మాన్ ఎవరో కాదు.. మన మమ్ముట్టి కొడుకు. హీరోయిన్ నిత్యామీనన్ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ చక్కని నటనను ప్రదర్శించారు. ఒక జంట మధ్య కెమిస్ట్రీ బాగా కుదరాలని అంటారు చూశారా.. ఆ కెమిస్ట్రీ వీరిద్దరి మధ్య బాగా వర్కవుట్ అయింది. దల్కీర్ సల్మాన్‌కి మన నాని డబ్బింగ్ చెప్పడం కలిసొచ్చింది.
ఇక దర్శకుడు మణిరత్నం విషయానికి వస్తే, ఆయన మరోసారి విజృంభించారు. ఆయనలోని ఉత్సాహాన్ని పెంచే సినిమా ఇది. ఎఆర్ రెహమాన్ సంగీతం, పిసి శ్రీరామ్ కెమెరా పనితనం ఈ సినిమాని ఎక్కడకో తీసుకెళ్ళి వదిలిపెట్టాయి. మొత్తమ్మీద ఒకసారి తప్పనిసరిగా చూడాల్సిన సినిమా ‘ఓకే బంగారం’.