ఒబామా తాజ్‌మహల్ సందర్శన రద్దు

 

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత రిపబ్లిక్ దినోత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొనడం కోసం ఆదివారం నాడు సతీసమేతంగా భారత దేశానికి వస్తున్న విషయం తెలిసిందే. ఆయన భారతదేశంలో మూడు రోజులుంటారని, తన భార్యతో కలసి ప్రేమకు ప్రతిరూపమైన తాజ్‌మహల్‌ని కూడా సందర్శిస్తారని ముందుగా ప్రకటించారు. తాజ్‌మహల్ని చూడటానికి ఒబామా ఉవ్విళ్ళూరుతున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే ఒబామా తాజ్‌మహల్ సందర్శన రద్దయినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఒబామా వస్తున్నాడని చెప్పి తాజ్‌మహల్ దగ్గర సెక్యూరిటీ అధికారులు నానా హడావిడి చేశారు. బోలెడన్ని ఆంక్షలు విధించారు. ఒబామా దంపతులు సందర్శించే రోజున సాక్షాత్తూ షాజహాన్, ముంతాజ్ వచ్చినా అవతలకి గెంటేసేంత సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు. సెల్ ఫోన్లు పనిచేయకుండా జామర్లు ఏర్పాట్లు చేశారు. ఇలాంటి ఏర్పాట్లు బాగానే చేశారు. చివరికి అన్నీ తుస్సుమన్నాయి. ఒబామా దంపతుల తాజ్‌మహల్ సందర్శన కార్యక్రమం రద్దయింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu