ఒబామా టూర్ షెడ్యూలు ఇదీ...



అగ్రరాజ్యం అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామా భారత గణతంత్ర దినోత్సవాలలో పాల్గొనడానికి ఆదివారం నాడు భారతదేశానికి వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఒబామా భారతదేశ పర్యటన షెడ్యూలు గతంలో ఖరారు చేసినట్టుగా కాకుండా కొద్దిగా మారింది. ఒబామా నిర్ణీత షెడ్యూల్ ప్రకారం జనవరి 25వ తేదీన ఢిల్లీ రానున్నారు. మూడు రోజుల పాటు భారత్లో పర్యటించనున్నారు. 27న తాజ్మహల్ పర్యటనను మాత్రం రద్దు చేసుకున్నారు. సౌదీ అరేబియా రాజు మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఒబామా ఇక్కడి నుంచి నేరుగా సౌదీ అరేబియా వెళ్లనున్నారు.

ఇండియాలో ఒబామా పర్యటన షెడ్యూల్

జనవరి 25:

ఉదయం 10 గంటలకు ఢిల్లీకి రాక.

12 గంటలకు రాష్ట్రపతి భవన్‌కు చేరుకుంటారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ స్వాగతం పలుకుతారు.

12:40: రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మా గాంధీకి నివాళులు అర్పిస్తారు.

మధ్యాహ్నం 2:45 గంటలకు  హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోదీతో భేటీ,
సాయంత్రం 4:10 గంటలకు మోదీ, ఒబామా మీడియా సమావేశం.

రాత్రి 7:35 గంటలకు మౌర్య హోటల్లో అమెరికా ఎంబసీ సిబ్బంది కుటుంబ సభ్యులతో సమావేశం.

7:50 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో విందు.

జనవరి 26:

ఉదయం 10.00 గంటలకు గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరు, అనంతరం రాష్ట్రపతి భవన్‌కు రాక.

మధ్యాహ్నం మోదీతో కలసి సీఈవో సదస్సులో ప్రసంగం
రాత్రి: ప్రధానితో విందు.

 
జనవరి 27:

ఉదయం 10.40: ఢిల్లీలోని సిరి కోటకు రాక.

12.20-1.30: హోటల్‌లో మధ్యాహ్న భోజనం.

అనంతరం సౌదీకి బయల్దేరడంతో ఒబామా పర్యటన ముగుస్తుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu