ఎన్టీఆర్ తో కొడాలి నాని, వంశీ  సినిమా ప్లాన్ చేస్తున్నారా!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (ntr)ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది సినిమాలు  చేసాడు. ఇప్పుడు ముప్పైవ చిత్రంగా దేవర(devara)చేస్తున్నాడు. తన కెరీర్లో చాలా వరకు విజయాలే ఎక్కువ.  పైగా  కొన్ని సినిమాలు మాత్రం అభిమానులతో పాటు ప్రేక్షక హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించాయి. అలాంటి వాటిల్లోని ఒక  రెండు సినిమాలు గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం.   .

సాంబ(samba)అదుర్స్(adurs)ఒకటి సోషల్ మెసేజ్ తో తెరకెక్కగా ఇంకోటి కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది. రెండు చిత్రాల్లోని ఎన్టీఆర్ నటన ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తుంది. కలెక్షన్స్ పరంగా కూడా బాక్స్ ఆఫీస్  వద్ద సరికొత్త రికార్డులు నెలకొల్పాయి. ఆ రెండు సినిమాలని నిర్మించింది. కొడాలి నాని(kodali nani)వల్లభనేని వంశీ(vallabhaneni vamsi)ఈ ఇద్దరు తన  స్నేహితులు కావడంతో ఎంతో మంది నిర్మాతలని పక్కన పెట్టి ఎన్టీఆర్ ఆ సినిమాలు చేసాడు. ఇక ఆ ఇద్దరు మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసారు. దీంతో మరో ఐదేళ్లు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి. అఫ్ కోర్స్ వాళ్ళకున్న వ్యాపారాలు చేసుకుంటారు అనుకోండి.  కాకపోతే  వాటిల్లో  సినిమా వ్యాపారం కూడా ఉంది. కాబట్టి మళ్ళీ  ఎన్టీఆర్ తో సినిమా ఏమైనా చేస్తారనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తుంది. ఒక వేళ ఎంట్రీ ఇస్తే  తన స్నేహితులకి ఎన్టీఆర్ సినిమా చేస్తాడో లేదో చూడాలి.

ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. సెప్టెంబర్ 27 న విడుదల కాబోతుంది. ఇదే డేట్ కి గతంలో  స్టూడెంట్ నెంబర్ వన్ కూడా వచ్చి  బ్లాక్ బస్టర్ కొట్టింది. దేవర విషయంలో కూడా ఇది రిపీట్ అవుతుందని  ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ మూవీ చెయ్యబోతున్నాడు.