అస్ట్రేలియాలో వివాహిత అనుమానాస్పద మృతి.. భర్త పరారు..
posted on May 28, 2016 11:31AM
హైదరాబాద్ కు చెందిన రమ్యకృష్ణ అనే వివాహిత అస్ట్రేలియాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మూడు నెలల క్రితం ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్‌లో ఉంటున్న మహంత్‌తో హైదరాబాద్ కూకట్‌పల్లి వాసి రమ్యకృష్ణ వివాహం జరిగింది. వివాహం అనంతరం వారు ఆస్ట్రేలియా వెళ్లిపోయారు. అయితే ఏమైందో ఏమో రమ్యకృష్ణ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈవిషయం మహంత్.. రమ్యకృష్ణ తల్లిదండ్రులకు చెప్పి ఆమె మృతదేహంతో హైదరాబాద్ వచ్చాడు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. భార్య మృతదేహాన్ని తీసుకొచ్చిన మహంత్.. ఆ మృతదేహాన్ని అక్కడే వదిలేసి పరారయ్యాడు.
దీంతో తన కూతురు చనిపోవడానికి మహంతే కారణమని.. రమ్యకృష్ణ తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. రమ్యకృష్ణది హత్యే అని.. మహంత్ ను కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి మహంత్ కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.